జూపార్కు రేట్లు పెరిగినయ్!

జూపార్కు రేట్లు పెరిగినయ్!
  • ఎంట్రీ , ఇతర సర్వీసుల ధరలు పెంచిన అధికారులు
  • మార్చి ఒకటి నుంచి అమల్లోకి..


హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్ నెహ్రూ జూ పార్కు ఎంట్రీ, ఇతర సర్వీసుల ధరలు మార్చి ఒకటి నుంచి పెరగనున్నాయి. ఈ మేరకు 13వ గవర్నింగ్ బాడీ నిర్ణయం తీసుకుంది. సాధారణంగా ఏడాదికి, రెండేండ్లకు ఒకసారి జూపార్క్​ రేట్లను సవరిస్తూ ఉంటారు. చివరిసారిగా 2023 మేలో ధరలను పెంచిన అధికారులు తాజాగా, మళ్లీ  రెండేండ్ల తర్వాత రేట్లు పెంచారు. ఎండాకాలం వస్తున్న నేపథ్యంలో జూపార్క్ కు రద్దీ పెరగనుంది.

స్కూళ్లు, కాలేజీలకు కూడా సెలవులు రాబోతున్నాయి. పిల్లలు, పెద్దలు జంతువులను చూడడానికి క్యూ కడతారు. దీంతో ఆదాయం పెంచుకునేందుకు అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.  

 పెరిగిన రేట్లు ఇలా.. 

ప్రస్తుతం సాధారణ రోజుల్లో ఎంట్రీ ఫీజు పెద్దలకు రూ. 70, వీకెండ్స్ లో రూ. 80 ఉంది. మార్చి ఒకటి నుంచి  సాధారణ రోజులు, వీకెండ్స్ అనే తేడా లేకుండా పెద్దలకు రూ.100 ఫిక్స్​ చేశారు. అలాగే ఇప్పుడు పిల్లలకు సాధారణ రోజుల్లో రూ. 45, వీకెండ్స్ లో రూ.55 తీసుకుంటున్నారు. మార్చి ఒకటి నుంచి అటూ ఇటూ కాకుండా రూ.50  చేశారు. టేబుల్ లో మెన్షన్​ చేయని, టాయ్ ట్రైన్​రైడ్, బీవోవీ, 11 సీటర్ బీవోవీ ఎక్స్​క్లూజివ్, బీవోవీ సింగిల్ పాయింట్, ఫిష్ ఆక్వేరియం, రెప్టైల్ హౌజ్ తదితరాల రేట్లు పెంచలేదు.  

మూవీ షూటింగ్​ కెమెరాకు రూ.10 వేలు 

ఇప్పటివరకు మూవీ షూటింగ్ కెమెరాను ప్రొఫెషనల్​వీడియో కెమెరాగా ట్రీట్​చేసి రూ. 600 తీసుకునేవారు.  సవరించిన ధరల ప్రకారం ఇక నుంచి మూవీ షూటింగ్​ కెమెరాకు రూ. 10 వేలు వసూలు చేయనున్నారు. ప్రస్తుతం ప్రొఫెషనల్​ వీడియో కెమెరాకు రూ.600 తీసుకుంటుండగా.. మార్చి ఫస్ట్​ నుంచి రూ. 2500 తీసుకోనున్నారు.

అలాగే ప్రస్తుతం 11 సీటర్​ బ్యాటరీ ఆపరేటర్​ వెహికల్స్  గంటకు రూ.3 వేలు తీసుకునేవారు. మార్చి నెల నుంచి దీని ధరలో ఎలాంటి మార్పు  చేయలేదు. అయితే, కొత్తగా 14 సీటర్​న్యూ బీవోవీ అందుబాటులోకి తెస్తున్నారు. దీనికి గంటకు రూ. 4వేలు తీసుకోనున్నారు. 


వివరాలు                                     ప్రస్తుతం        మార్చి నుంచి 


కెమెరా                                           100                           150
ప్రొఫెషనల్ వీడియో కెమెరా       600                          2,500
మూవీ షూటింగ్ కెమెరా              10,000
టాయ్ ట్రైన్ రైడ  పెద్దలకు         45          పెద్దలకు    8   పిల్లలకు 25    పిల్లలకు 40
14 సీటర్ న్యూ బీవోవీ                4000(60 నిమిషాలు)
ఫిష్ ఆక్వేరియం                          10                                  20
సఫారీ పార్క్​ డ్రైవ్  పెద్దలకు     80                                 100
  పిల్లలకు                                    45                                  100
ఏసీ  సఫారీ బస్                         120                                 150